పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి
అడ్డగూడూరు 30 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడని తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వివరాల్లోకి వెళ్తే బొడ్డుగూడెం గ్రామానికి చెందిన సూది రెడ్డి రామిరెడ్డి తండ్రి వెంకట నరసింహారెడ్డి వయసు 58 సంవత్సరాలు,అను అతను ఐదు సంవత్సరాల క్రితం తన భార్య చనిపోవడంతో అప్పటినుండి మానసికంగా బాధపడుతున్నాడు.అట్టి కారణము వలన 15-03-2026 నా గుర్తు తెలియని క్రిమి సంహారం మందు తాగి పొలం వద్ద పడి ఉండగా తన కుమారుడు సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా, ఆదివారం రోజు 29.03.2026 న చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విషయంపై తన కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.