చర్ల కేంద్రంగా భారీగా అక్రమ గోవుల రవాణా: అధికారుల పాత్రపై అనుమానాలు!
భద్రాద్రి కొత్తగూడెం, 31 మార్చి 2026 తెలంగాణవార్త జిల్లా స్టాపర్ : భద్రాద్రి కొత్తగూడెం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అక్రమ పశువుల రవాణా ముఠాలు బరితెగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలకు పశువులను తరలించేందుకు నేడు భారీగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 1200 గోవులను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు ఏర్పాట్లు చేసుకున్నారు.
అధికారుల మౌనం.. వెనుక మర్మమేమిటి?
ఈ అక్రమ రవాణా ఉదంతంలో అధికారుల తీరుపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 800 గోవులను తరలించినట్లు సమాచారం అందుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.నిఘా వైఫల్యం: ఇంత పెద్ద ఎత్తున పశువుల తరలింపు జరుగుతున్నా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడం వెనుక ఉన్న 'మర్మం' ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ముందస్తు ప్రణాళిక: పక్కా స్కెచ్‌తో, స్థానిక అధికారుల కళ్ళు గప్పి లేదా వారి సహకారంతోనే ఈ రవాణా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.: ఈ గోవులను ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రజా ఆగ్రహం
నిబంధనలకు విరుద్ధంగా, మూగజీవాలను హింసిస్తూ తరలిస్తున్న ఈ అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ రవాణాను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.