సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలి
మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి
సూర్యాపేటమున్సిపాలిటీ బడ్జెక్ట్ రూ 107.30 కోట్లు
అభివృద్ధికి అందరూ సహకరించాలి
మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి
సూర్యాపేట, 31 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట మున్సిపాలిటీ నూతన పాలక మండలి ఎన్నిక అయ్యిన తదుపరి మొదటి సమావేశం 2025-26 ఆర్ధిక సంవత్సరం సవరణ మరియు 2026-27 సంవత్సరం ముసాయిదా బడ్జెక్ట్ సమావేశాన్ని పట్టణంలోని రవి మహాల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా సమావేశంలో ప్రెవేశ పెట్టినరూ 107.32 లక్షల బడ్జెక్ట్ ను ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగామున్సిపల్ చైర్మన్ శ్రీమతి మొరిశెట్టి నివేదిత లక్షాధి మాట్లాడుతూ పురపాలక సంఘము సూర్యాపేట నకు 2026-27 సంవత్సరానికి ఇంటి పన్నులద్వారా రూ 1775 లక్షలు, స్టాంపు డ్యూటీ ద్వారా రూ 600 లక్షలు ఆదాయము నాన్ -ట్యాక్స్ ల ద్వారా అద్దెల ద్వారా రూ 204.50 లక్షలు, పరిశుద్ధ్య విభాగం ద్వారా రూ 111.50 లక్షలు పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా రూ 1568.50 లక్షలు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ 330.50 లక్షలు, డిపాజిట్ లు, రుణాల రూపంలో రూ 110 కోట్లు, నాన్ ప్లాంట్ నిధులు రూ 620 లక్షలు, ప్లాన్ నిధులు రూ 5170 లక్షలు, ఇతర నిధులు రూ 240 లక్షలు. మొత్తం కలిపి రూ 10730 లక్షల అంచనా బడ్జెక్ట్ ను రూపొందించుట జరిగింది అన్నారు.
అదే విధంగా వొచ్చిన ఆదాయం లో సిబ్బంది వేతనాలకు రూ 1420 లక్షలు, పరిశుద్ధ్య నిర్వహణకు రూ 522 లక్షలు, విద్యుత్ ఛార్జిలకు రూ 344 లక్షలు, రుణాలు చెల్లింపులకురూ 406 లక్షలు, గ్రీన్ బడ్జెక్ట్ కు రూ 459 లక్షలు, ఇంజనీరింగ్ విభాగం నిర్వహణ కు రూ 445 లక్షలు, సాధారణ పరిపాలన కు రూ 219.20 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం ఖర్చుకు రూ 7.50 లక్షలు, 1/3 బ్యాలెన్స్ బడ్జెట్ వేయం కు రూ 255.77 లక్షలు ప్రజా సౌకర్యల ఖర్చు కు రూ 65.73 లక్షలు, అభివృద్ధి పనులకు రూ 445.80 లక్షలు, డిపాజిట్లు, రుణాలు చెల్లింపుకు రూ 110 లక్షలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబోవు నాన్ ప్లాన్ గ్రాంట్ క్రింద అభివృద్ధి పనులకు రూ 620 లక్షలు, ప్లాన్ గ్రాంట్ క్రింద పనులకు రూ 2460 లక్షలు, ఇతర నిధుల క్రింద అభివృద్ధి పనులకు రూ 2950 లక్షలు మొత్తం రూ 10730 లక్షలు కేటాయించూట జరిగింది అన్నారు, మున్సిపాలిటీ కి వొచ్చే ప్రధాన ఆదాయం మొత్తం కూడ సిబ్బంది జీతభత్యాలు, కరెంట్ బిల్లుల చెల్లింపులు, పరిశుద్ధ్య,నీటి సరఫరా, పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కు ఖర్చు అవుచున్నాయి అని అన్నారు.
పట్టణభివృద్ధికి ఆదాయ సమకూర్చొకొని అభివృద్ధి చేసుకొనుటకు ప్రజలు, ప్రజా ప్రతి నిధులు, మున్సిపాల్ పాలక మండలి సభ్యులు సహకరించాలి అన్నారు, అనంతరం మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు, ఇట్టి సమావేశంలో కౌన్సిలర్ లు తమ వార్డు సమస్యలను ఛైర్పర్సన్ మరియు కమీషనర్ ద్రుష్టి కి తీసుకొని వొచ్చారు, ఈ కార్యక్రమంమలు మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ యం.డి. షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ సి. ఎచ్. హన్మంత రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు