పుట్టినరోజు సందర్భంగా రక్తదానం
జోగులాంబ గద్వాల 6 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల:- ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం నిర్వహించిన తోటి స్నేహితులు.రక్త దానం ప్రాణ దానంతో సమానం అని పుట్టినరోజు జరుపుకుంటున్న నాగరాజు అన్నారు.గురువారం తన జన్మదిన సందర్భంగా గద్వాల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో తమ స్నేహితులతో కలిసి రక్త దాన నిధిలో రక్తదానం చేశారు. ఆయనతో పాటు తన మిత్రులు దాదాపు 12 మంది మిత్రుడి పుట్టిన రోజున రక్త దానం చేయడం విశేషమని చెప్పు కోవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్త దానం చేయాలని కోరారు. పుట్టినరోజుల సందర్భంగా సంబరాలు జరుపుకుంటూనే కాదు మానవ సేవ కూడా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో, మండలంలో ఏదో ఒకచోట రక్తం సరైన సమయానికి అందక అనేకమంది ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. కావున 18 సంవత్సరాలు నుండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం నిర్వహించడం మంచి నిర్ణయమని రక్త బ్లాక్ బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ వినేమా అన్నారు.
ఈ కార్యక్రమంలో
నాగరాజు స్నేహితులు శివకుమార్, జగదీష్,రాజశేఖర్, రాము, పురుషోత్తం,సురేష్,మహేష్, సవరన్నా,బాగే వసంత్,పరుశరామ్ రాముడు,ఈశ్వర్ తదితరులు ఉన్నారు.