పిల్లలమర్రిలో కొనసాగుతున్న అధ్యయన బ్రహ్మోత్సవాలు

సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి): మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో 121వ అధ్యయన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం మరియు సాయంత్రం యాగ్నికిలు మరింగంటి వరదా చార్యులు ప్రబంధ సేవాకలం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ చైర్మన్ గుకంటి రాజబాబు రెడ్డి మాట్లాడుతూ..పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటం జరిగింది అన్నారు.ఆరు రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించాలని కోరారు.గురువారం మధ్యానం గరుడ ముద్ద కార్యక్రమం ఉంటుందని రాత్రికి ఎదురు కోలు అనంతరం కళ్యాణం జరుగుతుందని తెలిపారు.వివాహం సంతానం ఆరోగ్యం కోసం భక్తులు గరుడ ప్రసాదం స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు,దరూరి రాఘవా చార్యులు,చింతడ రామానుజ చార్యులు,ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్, వైస్ చైర్మన్ మంగపoడ్ల మల్లికార్జున్,కందకట్ల రాంబాబు, బంగారి కృష్ణయ్య, కోనేటి కృష్ణ, చెరుకుపల్లి రాజు,బంగారి సైదమ్మా మల్లయ్య,గoపల శంకర్ ,అంకం భిక్షం తదితర భక్తులు పాల్గొన్నారు...