ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

Mar 11, 2024 - 21:01
 0  7
ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

హైదరాబాద్:మార్చి 11 పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది.

దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికా ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి.

ఇక భారతదేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తారు.భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కూడా, పవిత్ర రంజాన్ మాసం మార్చి 12, మంగళ వారం నుండి ప్రారంభమవు తుంది. ఈ నెలలో, ముస్లిం   లు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవా సం ఉంటారు.
రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
ఇది నెల ప్రారంభం, ముగిం పును నిర్ణయించడంలో కీల కమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లిం లు ఈద్-ఉల్-ఫితర్ జరుపు కుంటారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333