మైనార్టీ బాలుర గురుకుల కళాశాలల యందు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Jan 24, 2025 - 20:22
Jan 24, 2025 - 20:39
 0  3
మైనార్టీ బాలుర గురుకుల కళాశాలల యందు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

అందోల్-జోగిపేట :అందోల్ నియోజకవర్గం తెలంగాణవార్త ప్రతినిధి:- సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని జోగిపేట గ్రామంలో గల  మైనార్టీ బాలుర  కళాశాల లో వచ్చే విద్యాసంవత్సరానికి గాను (2025-2026) సంబంధించి ఇంటర్మీడియట్లో   మొదటి   సంవత్సరంలో సీ.ఈ.సీ  మరియు  ఎం.ఈ.సీ గ్రూపులకు ప్రవేశాలకు   దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది అని  కళాశాల ప్రిన్సిపల్ కే.ఎస్. జమీల్ తెలిపారు. మైనారిటీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కుల, జైన్,  పార్సీ మరియు బౌద్ధులు) ల కొరకు 75% సీట్లు మరియు నాన్ మైనారిటీల ( యస్.సి, యస్.టి మరియు బీ.సీ) ల కొరకు 25% సీట్లు రిజర్వ్ చేయబడినవని తెలిపారు. ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా (www.tgmries. telangana.gov.in) లేదా TGMREIS మొబైల్ యాప్ ద్వారా గాని నేరుగా  జోగిపేట లో గల మైనార్టీ గురుకుల  కళాశాలకు వెళ్లి ఫిబ్రవరి 28 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

మరింత సమాచారం కోసం క్రింది నంబర్లను సంప్రదించగలరు: 8106101383/ 9581522963/ 8106287964/ 9502044281.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333