పిడిఎస్ రైస్ అక్రమ రవాణకు సహకరించిన కానిస్టేబుల్ సస్పెండ్:జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

జోగుళాంబ గద్వాల్4 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న PC: 2258, ఆర్ . కృష్ణయ్య బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ పిడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వారికి సహకరిస్తున్నారన్న సమాచారం మేరకు విచారణ చేపట్టగా అట్టి విషయం ఋజువైనందున పై చర్య టిఎస్ సిఎస్ (సీసీ&ఏ ) రూల్స్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీసు కానిస్టేబుల్ కృష్ణయ్య ను జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసు అధికారుల పనితీరును, సమాజంలో వారి ప్రవర్తనను పోలీస్ శాఖ నిశితంగా పరిశీలిస్తుందని, పోలీస్ శాఖలో పనిచేస్తూ ఇలాంటి చర్యలను ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ తెలియజేశారు.