పత్తి కొనుగులు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్.

Oct 4, 2024 - 18:16
 0  8
పత్తి కొనుగులు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి

జోగులాంబ గద్వాల4 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పత్తిని సజావుగా కొనుగోలు చేసే విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పత్తి కొనుగులు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ఈ సీజన్ లో జిల్లావ్యాప్తంగా 1.29 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగిందన్నారు.  ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున దాదాపు 12.91లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందని అన్నారు.  ఇందుకు గాను అలంపూర్ లో ఒక  పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.  రైతులు తమ పండించిన పత్తికి మద్దతు ధర అందాలంటే కచ్చితంగా తేమ శాతం 8-12 ఉండేటట్లు చూసుకోవాలన్నారు. నాణ్యమైన మేలు రకం పత్తికి కనీస మద్దతు ధర రూ. 7,521/- కాగా, మామూలు పత్తికి రూ. 7,121/- చొప్పున చెల్లించడం జరుగుతుందని తెలిపారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేకరించిన పత్తిని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, సీసీఐ ద్వారా రైతులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈ మాసంతం వరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 

     ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, సీసీఐ కమర్షియల్ అధికారి రోహన్ దుబే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333