ధర్మ బిక్షం ఉద్యానవనం కొరకు ప్రభుత్వం స్థలం ఏర్పాటు చేయాలి

Mar 27, 2025 - 02:32
Mar 27, 2025 - 07:00
 0  12

సామాజిక విప్లవకారుడు కామ్రేడ్ ధర్మబ భిక్షం

యువత ధర్మ బిక్షం ను స్ఫూర్తిగా తీసుకోవాలి.

సూర్యాపేట జిల్లాలో ఒక ఎకరం స్థలం ధర్మ బిక్షం ఉద్యానవనం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి

.తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట, టౌను మార్చి 26:- బడుగు,బలహీన వర్గాల ఆశయ సాధన కోసం తన తుది శ్వాస విడిచే వరకు ఉద్యమించిన గొప్ప మహనీయుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఉద్ఘాటించారు. ధర్మభిక్షం 14 వర్ధ0తి సందర్భoగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరంఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా,సామాజిక ఉద్యమ విప్లవ కారుడిగా నిత్యం ప్రజా సంక్షేమం కోసo పోరాటం చేసిన గొప్ప నాయకులు ధర్మభిక్షo అని కొని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ సిద్ధాంతాలకు అనుగుంగా పోరాటం చేస్తూనే ఎంపీగా,ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు గెలుపొందిన మహానేత అని గుర్తు చేశారు. అందుకోసం ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ధర్మ బిక్షం పేద ప్రజలకు భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల పక్షాన నిలబడి కార్మిక సంఘాలుగా యూనియన్లు సంఘ బలోపేతానికి కృషి చేశారు అని చెప్పుకొచ్చారు. ధర్మబిక్షమును స్ఫూర్తిగా తీసుకోవాలి. సూర్యాపేట జిల్లాలో ధర్మాభిక్షం గుర్తుగా ఉద్యానవనం కొరకు ఒక ఎకరం స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యుధుడు కామ్రేడ్ బొమ్మ గాని ధర్మాభిక్షము ను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు రాణించాలి అని అన్నారు.

ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, కోశాధికారి పాల సైదులు, సూర్యాపేట జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కక్కిరేణి నాగయ్య గౌడ్ ఏలుగూరి గోవిందు రాపర్తి పెద్ద శీను జిల్లా రియల్ ఎస్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పట్టణ కార్యదర్శి అయిత గాని మల్లయ్య గౌడ్ పట్టణ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ రాపర్తి జానయ్య గౌడ్ జిల్లా కార్యదర్శి ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ జిల్లా సహాయ కార్యదర్శులు కొప్పు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి రమ కిరణ్, పర్వతం వెంకటేశ్వర్లు, బానోత్ జాను నాయక్, పట్టేటి కిరణ్ పట్టణ ఉపాధ్యక్షులు కడారి అంజయ్య , సాయి, పేగ్గేపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333