ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్
జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు భయం దోలనకు గురవుతున్నారు. ధరూర్ మండల కేంద్రంలో జాతీయ ప్రధాన రహదారిలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కంచేలేక ప్రమాదకరంగా ఉంది. ఫీజు బాక్స్ వైర్లు చేతికి అందేలా ఉండడంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు,పాదాచారులు,రాకపోగా సాగిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేకపోవడంతో వాహనాదారులు ప్రమాద బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూగజీవాల విషయంలో మరింత జాగ్రత్త ఉండాల్సిన వస్తుంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం విద్యుత్ అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.