పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు అందజేత

Aug 21, 2025 - 05:47
 0  175
పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు అందజేత

తిరుమలగిరి 21 ఆగస్ట్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా వుంచుతున్న పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు అందజేసిన మున్సిపల్ కమీషనర్  మున్వర్ అలీ . ఈ సందర్భంగా కమీషనర్  మాట్లాడుతూ ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా వుంచిన కార్మికులు వర్షంలో తడిసి జ్వరం బారినపడకూడదని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్  ఆదేశానుసారం పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు అందజేశమన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శోభ, వార్డు ఆఫీసర్లు,మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034