పోషణ మాస ఉత్సవాలు
గర్భిణీలకు శ్రీమంతం అక్షరాభ్యాసం అన్న ప్రసరణ కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం ఇటిక్యాల సెక్టర్ మీటింగ్లో పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ మాసమహోత్సవంలో భాగంగా గర్భిణీల శ్రీమంతం అక్షరాభ్యాసం అన్నప్రాసన మరియు గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది. ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి మాట్లాడుతూ..... పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులు కిశోర బాలికలు సమతుల ఆహారం తీసుకోవాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే ఆకుకూరలు పండ్లు కూరగాయలు పాలు ఎక్కువగా తీసుకోవాలని రక్తహీనత పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలు వృద్ధులు చిన్నారులు పాల్గొన్నారు.