ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే

Apr 12, 2024 - 18:16
Apr 12, 2024 - 19:04
 0  11
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే

ఢిల్లీ, 12 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ది కీలకపాత్ర అని సీబీఐ చెబుతోంది. సౌత్ గ్రూప్‌‌నకు చెందిన వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది. లిక్కర్ బిజినెస్‌కు సహకరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారన్నారు. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు. కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. కవితను అరెస్ట్ చేశామని తెలిపింది. ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది.

సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం రికార్డు చేశామని కోర్టుకు సీబీఐ తెలిపింది. వాట్సాప్ చాట్స్, వాంగ్మూలాలు ఇచ్చారని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కాంలో కవిత కీ రోల్ పోషించారన్నారు. రూ.‌100 కోట్ల మనీని విజయ్ నాయర్ ద్వారా ఆప్ నేతలకు ఇచ్చారన్నారు. సౌత్‌కు చెందిన కీలక మద్యం వ్యాపారి కేజ్రీవాల్‌ను కలిశారన్నారు. ఆ తర్వాత కవిత తనను కలవాలని ఆ మద్యం వ్యాపారికి చెప్పారన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనపై తాము పని చేస్తున్నట్లు చెప్పారన్నారు. రూ.100 కోట్లలో రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత సూచించారన్నారు. 2021లో పలు లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో భాగంగా ఇండో స్పిరిట్‌కు ఎల్ 1లను పొందారన్నారు. లావాదేవీలు, ఇతర సమాచారాన్ని కోర్టు ముందుంచామన్నారు. 11.9 కోట్లు గోవా ఎన్నికల్లో హవాలా రూపంలో వెళ్లాయన్నారు.

అభిషేక్ బోయిన పల్లి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పంపినట్లు కవిత పీఏ అశోక్ కౌశిక్ అంగీకరించారని సీబీఐ తరుఫు న్యాయవాది తెలిపారు. బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఇండో స్పిరిట్‌లో కవితకు 33% వాటా ఉందన్నారు. ఢిల్లీ తాజ్ హోటల్‌లో 20/9/2021 నాడు జరిగిన మీటింగ్‌లో శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారన్నారు. అభిషేక్ బోయినపల్లి విజయ్ నాయర్‌తో కలిసి ఇందులో కీలకంగా వ్యవహరించారన్నారు. మహబూబ్‌నగర్ నగర్‌లో భూమి అమ్మేందుకు శరత్ ప్రయత్నించారని సీబీఐ తరుఫు న్యాయవాది తెలిపారు. సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన మా పిటిషన్‌పై విచారణ నిర్వహించాలని కవిత తరుఫు న్యాయవాది కోరగా.. తొలుత సీబీఐ వాదనలు ముగియనివ్వాలని జడ్జ్ సూచించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333