పోషకాహారం లోపం శరీరం ఎదుగుదలపై అవగాహన సదస్సు

Aug 9, 2024 - 20:11
 0  152
పోషకాహారం లోపం శరీరం ఎదుగుదలపై అవగాహన సదస్సు
పోషకాహారం లోపం శరీరం ఎదుగుదలపై అవగాహన సదస్సు

జోగులాంబ గద్వాల 9 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండల కేంద్రం  ఇటిక్యాల రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఛాంపియన్ రెండు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎస్. ఎస్ .ఎఫ్. పి సూపర్వైజర్ సప్లమెంటరీ ఫీడింగ్ అధికారుల పర్యవేక్షణ లో పోషకాహారం లోపం వలన జరిగే అనర్థాలను, ఉపయోగాలా, పై ఆశా వర్కర్ ఏఎన్ఎం, అంగన్వాడీ లకు సామూహికంగా  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వారికి గ్రామాలలో పిల్లలు  ,చిన్నారులు శారీరకంగా ఎదుగుదల లేకుండా వయసుకు తగ్గ బరువు లేకపోవడం, అధిక బరువుతో ఉండడం, రక్తహీనతతో వయసుకు సంబంధం లేకుండా శారీరకంగా న్యూట్రిన్స్ లోపాలతో అవగాహన లేకుండా వివిధ గ్రామాలలో జీ రో టు ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలు  తెలియక ఇబ్బందులకు గురి అవుతుంటారు వారి కోసం మనమందరం కలిసి అలాంటి వారిని గుర్తించి వారి గృహాలను సందర్శించి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ ఆశా వర్కర్లు కలిసి కట్టుగా పనిచేసి ఈ యొక్క లోపాలను ఉన్నవారిని గుర్తించి సమర్ధవంతంగా తగ్గించడం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని  ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి జిల్లాస్థాయి పోషణ అభియాన్ నుండి రఘునాథ్ రెడ్డి. హెల్త్ సూపర్వైజర్ సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333