పడక విప్పిన నాగుపాము చింతకుంటలో వింత ఘటన!!
నాగర్ కర్నూల్ వనపర్తి బ్యూరో(గౌతమ్ న్యూస్)
వనపర్తి జిల్లా పరిధిలోని పానగల్ మండలం చింతకుంట గ్రామంలో సోమవారం గ్రామ సమీపంలో ఉన్న శివమ్మ అనే మహిళా రైతు
ఈరోజు తన పొలం దగ్గర పొలంలో మినుములు విత్తడానికి ట్రాక్టర్ డ్రైవర్ కోట్ల రాముడితోన పొలంలో భూమి దున్నుతున్న సమయంలో టాక్టర్ దగ్గరకు ఒక పెద్ద నాగుపాము వచ్చి పడగ విప్పుకొని నిలబడి పెద్ద పెద్ద శబ్దాలతోనా బుసలు కొడుతుండగా పాము ను చూసిన శివమ్మ ఒక్కసారిగా భయం ఆందోళనకు గురైన ఆమె ట్రాక్టర్ డ్రైవర్ కోట్ల రాములు కి ట్రాక్టర్ను వెనక్కి తీసుకోవాలని చెప్పింది వెంటనే ట్రాక్టర్ ని వెనక్కి తీస్తుండగా ట్రాక్టర్ ఎటు వెళ్తే అటుగా నాగుపాము రావడం అందరిని కలసి వేసింది,
ఇలా 40 నిమిషాల పాటు ట్రాక్టర్ దగ్గరనే ఉన్న నాగుపాము
శివమ్మ వెంటనే గ్రామ యువకుడైన పరమేష్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది,
పరమేష్ వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణసాగర్ కి సమాచారం చేరవేయగా ఆయన హుటా హుటిన వనపర్తి నుంచి చింతకుంట గ్రామానికి చెందిన శివమ్మ పొలం దగ్గరికి చేరుకొని ట్రాక్టరు ముందర పెద్ద పడగ విప్పుకొని ఉన్ననాగుపామును గమనించిన కృష్ణ సాగర్ ట్రాక్టర్ ని వెనక్కి తీయాలని ట్రాక్టర్ డ్రైవర్, కోట్ల రాముని కోరగా వెనక్కి తీసుకున్న క్రమంలో కూడా నాగుపాము ట్రాక్టర్ టైర్ల జాడలు వెంట ట్రాక్టర్ వైపుకు పోవడం జరిగిందని, కృష్ణ సాగర్ వెంటనే నాగుపాము ను చాకచక్యంగా బంధించారు, ఈ విషయం పైన
కృష్ణసాగర్ మాట్లాడుతూ పాములు ఎక్కువగా ఆకలితో ఉన్నప్పుడు మనుషులను కానీ శబ్దాలను కానీ గ్రహించిన పెద్దగా పట్టించుకోకుండా ఆహారం పైనే ఎక్కువ దృష్టి పెట్టి ఆహారం కొరకు వెతుకుతా ఉంటాయి ఇందులో భాగంగానే ఈరోజు శివమ్మ ట్రాక్టర్ దునిస్తున్న క్రమంలో రంద్రాల నుంచి ఎలుకలు బయటికి రావడంతో మనుషులు ఉన్న పెద్దగా పట్టించుకోకుండా ఆహారం కొరకు వెతకడం జరిగిందని తెలిపారు, ఈ ఘటన వనపర్తి జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా సంచలనం సృష్టించింది, పడక విప్పిన కోడి నాగుపాము చింతకుంట గ్రామంలో ఈ విధంగా వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ ముందు పడకవిప్పి కనిపించిన దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది, నాగుపాము తన పుట్టిన చిన్న పిల్లలను గుడ్లను చంపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ విధంగా చేసినట్లు స్నేక్స్ సొసైటీ అధ్యక్షులు కృష్ణసాగర్ అంటున్నారు,