వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం"గుడిమెట్ల నాగమణి

Oct 14, 2024 - 17:49
Oct 14, 2024 - 17:53
 0  30
వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం"గుడిమెట్ల నాగమణి

గుడిమెట్ల నాగమణి సంవత్సరకానికి వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం అన్నదానం మహాదానం:గుడిమెట్ల సూరిరెడ్డి కోదాడ,అక్టోబర్ 14:కోదాడ పట్టణానికి చెందిన గుడిమెట్ల సూరిరెడ్డి కుమార్తె గుడిమెట్ల నాగమణి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని స్థానిక శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గుడిమెట్ల సూరిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పాప సంవత్సరం క్రితం అనారోగ్యంతో మృతి చెంది ఇప్పటికి సంవత్సరం అయిన సందర్భంగా ఆమె సంవత్సరికం సందర్భంగా మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.మా పాప కూడా సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఆసక్తికరంగా పాల్గొనేదని అందువల్లనే ఆమె జ్ఞాపకార్థం సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుడిమెట్ల వెంకటరెడ్డి,గుడిమెట్ల సుజాత,పల్లపు నాగరాజు,మందలపు కిరణ్,మానసిక వికలాంగుల ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State