నైతిక విజయం మనదే. ఎప్పటికీ ప్రజల సేవలోనే సర్వోత్తమ్ రెడ్డి
తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్ : నైతిక విజయం మనదే అస్లాతండ కాంగ్రెస్ అభ్యర్ధి వాంకుడోత్ శ్రీనునాయక్ నీ ఓదార్చిన సర్వోత్తమ రెడ్డి... ఆత్మకూరు ఎస్... ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ప్రజల కు దూరం కాలేము కదా ప్రజల కు సేవ చేయాలని తపన ఉన్నవారికి పదవులు అవసరం లేదని ఏ ఐ సి సి నాయకులు సర్వోత్తమరెడ్డి అన్నారు సోమవారం మండల పరిధిలోని అస్లతండా లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లు తో ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధి వాంకుడోత్ శ్రీనునాయక్ ను పరామర్శించి ఓదార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందనీ ఆ పథకాలు అర్హులైన పేదల కు అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు చూడాలని తెలిపారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధులు ను పార్టీ అన్ని విధాలు గా ఆడుకుంటున్నారు.ఈ కార్యక్రమం లో శంకర్ నాయక్, శ్రీనివాస్, ధర్మ వీరు తదితరులు పాల్గొన్నారు.