గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో తిరగని ఫ్యాన్లు

Mar 6, 2026 - 18:40
 0  0
గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో తిరగని ఫ్యాన్లు

వేడికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

జోగులాంబ గద్వాల 6మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల.*జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అన్ని ఫ్లాట్ ఫామ్ లో దగ్గర ప్రయాణికులు రద్దీగా ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఫ్యాన్లు తిరగకుండగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పట్టించుకునే నాథుడు కరువయ్యాడు గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ప్రయాణికులకు కనీస అవసరాలు ఫ్యాన్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో గద్వాల ఆర్టీసీ బస్టాండ్ ఉందని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు.

దయచేసి ఆర్టీసీ డిఎం స్పందించి ఫ్యాన్లు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు  ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333