ఉప సర్పంచ్ గా యువకుడు పవన్ కుమార్

Dec 16, 2025 - 05:23
 0  266
ఉప సర్పంచ్ గా యువకుడు  పవన్ కుమార్

  తిరుమలగిరి 16 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తిరుమలగిరి మండలం, గుండెపురి గ్రామపంచాయితి కార్యాలయం నందు వార్డ్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కొమ్ము సోమయ్య వార్డు సభ్యులు మొత్తం 7గురు హాజరై 4వ వార్డు సభ్యులైన పాలకుర్తి పవన్ కుమార్ ని ఉపసర్పంచ్ గా ఏకాభిప్రాయంతో సభ్యులు ఆమోదించారు.ఈ సందర్భంగా యువకుడు ఉప సర్పంచ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి  అభివృద్ధి పనులు చేస్తారని తెలిపారు అలాగే ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు  ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి ఎంపీడీవో లాజర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి . వెంకటేశ్వర్లు , మాస్టర్ ట్రైనర్. అశోక్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి