నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ కౌన్సెలింగ్

Jul 4, 2024 - 20:21
 0  5
నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్:జులై 04: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ లో ప్రవేశానికి టీజీ ఎప్ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి షురూ అయ్యింది. 

నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు తొలివిడత రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. దీనిలో భాగంగా విద్యార్థు లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్లకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 36 హెల్ప్ లైన్ సెంటర్లలో ఏదొక చోట ధ్రువపత్రాల పరిశీల నకు హాజరవ్వాల్సి ఉంటుం ది. పరిశీలన చేయించుకు న్న వారు ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాలి. 

వారికి ఈనెల 19న లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయిస్తారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ కు జులై 19 నుంచి 23వ తేదీ వరకు అవకాశం కల్పిం చారు. 

గతేడాది వరకు ఫలితాలు రిలీజ్ చేసేందుకు ఒక వెబ్ సైట్, అడ్మిషన్లకు కౌన్సెలింగ్ కు మరో వెబ్ సైట్ ఉండేది. దీంతో విద్యార్థులు అయో మయానికి గురయ్యేవారు. 

ఈసారి ఎప్ సెట్ వెబ్ సైట్ www.eapcet.tsche.ac.inలోకి వెళ్లి అక్కడ అడ్మిషన్ పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్ సైట్లో కీ చూడాల్సి ఉంటుంది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333