*నూతన పార్టీని స్థాపించిన హిందుస్థాన్ సమ సమాజ పార్టీ అధ్యక్షుడు హజారి శ్రీనివాస్*

Mar 12, 2024 - 19:18
 0  2
*నూతన పార్టీని స్థాపించిన హిందుస్థాన్ సమ సమాజ పార్టీ అధ్యక్షుడు హజారి శ్రీనివాస్*

తుంగతుర్తి మార్చి 12 తెలంగాణ వార్త ప్రతినిధి 

తుంగతుర్తి మండల పరిధిలోని పార్టీ కార్యాలయంలో హిందుస్థాన్ సమసమాజ పార్టీ స్థాపకులు అధ్యక్షులు హజార్ శ్రీనివాసరావు పత్రిక సమావేశంలో మాట్లాడుతూ నేను గత 1985 నుండి బిజెపి పార్టీలో రాష్ట్రస్థాయిలో ఎదిగి 

ఈ ప్రాంతంలో కొన్ని సామాజిక సేవలను అందిస్తూ స్వచ్ఛందంగా ఎన్నో సేవలు అందించామన్నారు పేదవారికి తోడుగా నిలిచి ఈ ప్రాంతంలో ప్రజలకు సేవనందించాలని తపనతో నూతన పార్టీని స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 మంది పార్లమెంట్ అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందన్నారు.

హిందుస్థాన్ సమసమాజ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులు మేధావులు విద్యావంతులు ఐకమత్యంతో నూతన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని మీరు ఎప్పుడైనా మా పార్టీలో చేరి పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సేవలు అందించిన వారికి పార్టీ టికెట్లు లభిస్తాయని మన తెలంగాణలో కొన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి హిందుస్థాన్ సమసమాజ పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందన్నారు.

కావున పేదలు బడుగు బలహీన వర్గాలు మొత్తం ఆలోచన చేసుకొని మా పార్టీలో చేపడుతున్న కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా సేవలు అందిస్తూ ప్రజాసేవదకే అంకితమైన అన్నారు.

అదేవిధంగా వచ్చే సర్పంచులు ఎంపీటీసీల స్థానాల్లో కూడా పోటీ చేయడానికి మన పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు కావున బడుగు బలహీన వర్గాల వారు నిరుద్యోగులు మేధావులు కూడా మేమే గ్రామాలలోని సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ ప్రజాసేవకు అంకితం కావాలన్నారు.

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.