నీట్ పేపర్ లీకేజీ విద్య సంస్థలు బంద్

Jul 4, 2024 - 19:53
Jul 4, 2024 - 23:35
 0  4
నీట్ పేపర్ లీకేజీ విద్య సంస్థలు బంద్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ విద్యా సంస్థల బందు ఆత్మకూరు ఎస్ నీట్ పరీక్షను రద్దుచేసి పరీక్ష పేపర్ లీకేజి పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించి విద్యార్ధులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఎస్ యు ఐ ఎస్ ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు డివైఎఫ్ఐ పి వై ఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బందుకి పిలుపునివ్వడం జరిగింది. పిలుపు లో భాగంగా ఏపూర్ గ్రామం లో ఎస్ఎఫ్ఐ పి డి ఎస్ యు డి వై ఎఫ్ ఐ గ్రామ కమిటీల ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను బందు చెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ రాష్ట్ర కమిటి సభ్యులు సాన బోయిన ఉపేందర్ ఎస్ ఎఫ్ ఐ నాయకులు వరికుప్పల మహేష్, జుజ్జూరి సతీష్, వంశి, సాయి, కప్ప మనోహర్ పి డి ఎస్ యు నాయకులు చిత్తలూరి ఉదయ్ సుధగని రాకేష్ తదితరులు పాల్గొన్నారు.