ఎస్సీ హాస్టల్ లో సరైన సౌకర్యాలు కల్పించాలని. కే వి పి యస్

Jul 4, 2024 - 19:51
 0  3
ఎస్సీ హాస్టల్ లో సరైన సౌకర్యాలు కల్పించాలని. కే వి పి యస్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఆత్మకూర్(ఎస్) ఎస్సీ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించాలి...మరణీంచిన విద్యార్ధి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి...కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి... ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు. నిన్న ఉదయం అనుమానాస్పదంగా అకస్మాత్తుగా మృతి చెందిన ఏడో తరగతి విద్యార్థి మెల్లం శ్యామ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఈరోజు కెవిపిఎస్ జిల్లా బృందం ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 మంది విద్యార్థులు చదువుతున్న ఆ హాస్టల్ లో సరైన సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్ ఆవరణలో బాత్రూములకు పక్కన సర్కారు చెట్లు మరియు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి పాములు, తేళ్లు మరియు విష పురుగులు వచ్చే విధంగా ఆ పరిసరాలు ఉన్నాయన్నారు. ప్రహరీ గోడ వెలుపల,హస్తల బయట విపరీతమైన కంపచెట్లు ఉండడంతో హాస్టల్ లోపలికి పాములు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంక్షేమ హాస్టల్ లపై సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాటి మూలంగా విద్యార్థులు తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో జిల్లా కలెక్టర్ సందర్శించి సౌకర్యాల గురించి తెలుసుకొవాలని అన్నారు. విద్యార్థి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్ష్ గ్రెసీయా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు యాతాకుల ప్రవీణ్,ములకలపల్లి రవీందర్, తాళ్లపల్లి మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.