ఉరి వేసుకొని వ్యక్తి మృతి . మాడుగులపల్లిఎస్సై కృష్ణయ్య

తెలంగాణ వార్త మాడుగుల పల్లి మార్చి 27 : ఈరోజుమాడుగుల పల్లి మండలంలోని గండ్రవాని గూడెం గ్రామానికి చెందిన కంచర్ల లచ్చిరెడ్డి s/o బిక్షా రెడ్డి, వ.50 సంవత్సరాలు,గత నాలుగు నెలల నుండి మతిస్థిమితం సరిగా లేక బాధపడుతూఎటుపడితే అటు తిరుగుతూ ఇంటి నుంచి తప్పిపోతుండేవాడనీరెండు రోజుల క్రితం కూడా రాత్రి సమయంలో దేవతల వారి గూడెం వెళ్లగా ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని రావడం జరిగిందనీ నిన్నటి రోజున మేకల కాపలి వెళ్లొచ్చిన తర్వాత ఇంట్లో నుండి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకగా నిన్న రాత్రి అందాజ ఎనిమిది గంటల సమయంలో తన బావి వద్ద వేప చెట్టుకు తన లుంగితో ఉరివేసుకొని చనిపోయి కనిపించినాడని మృతుని యొక్క చిన్న కొడుకు సూర్యనారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగినది. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శివ పరీక్షా అనంతరం రక్త బంధువులకు మృతదేహాన్ని అప్పగించడం జరిగినది.