నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
తిరుమలగిరి 23 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ లో క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో 3,14 వార్డులలో మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి మరియు కమిషనర్ వర్షపు నీటి సంరక్షణ పై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి , మాట్లాడుతూ, వచ్చే ముందు తరాలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రతి పౌరుడు వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలి. ప్రతి ఇంటిలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంపొందించేందుకు సహకరించాలి అని కోరారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్. వెంకన్న మాట్లాడుతూ, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. వర్షపు నీటి సేకరణ ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచుకోవచ్చు. ప్రజలందరూ ఇంకుడు గుంతలు, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్, పలు కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్, ఆర్పీలు వాటర్ మాన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.