సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే .
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. నియోజకవర్గం కెటి దొడ్డి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315 వ వర్ధంతి మండల గౌడ సంఘం నాయకులు యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గద్వాల ఎమ్మెల్యే *బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోరాటా స్ఫూర్తిని కొనియాడారు, జిల్లాలో ఉన్నటువంటి గౌడ సంఘం నాయకులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ ఆశయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు....
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు పచ్చర్ల శ్రీధర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు ఉరుకుందు, చంద్రశేఖర్, నవీన్ రెడ్డి,మల్లేష్ గౌడ్, గోపి, శేఖర్, కాసీం, శేఖర్ రెడ్డి, టీచర్ గోవిందు, పవన్ రెడ్డి, నాసిర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.