ఏపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీషర్ట్స్ పంపిణీ
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గోపగాని శ్రీరాములు , వీరభద్రమ్మ గార్ల జ్ఞాపకార్థం ఏపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీషర్ట్స్ పంపిణీ గోపగాని శ్రీరాములు వీరభద్రమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ మరియు వారి సోదరులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరు విద్యార్థులకు 25 వేల రూపాయల విలువ గల120 టీ షర్టులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ ఆధ్వర్యంలో, పాఠశాల వ్యాయామోపాధ్యాయులు రవి సమన్వయంతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ధారా సింగ్ గారు అలాగే దాతల తరుపున గోపగాని సుధాకర్ పాల్గొని విద్యార్థులకు టీ షర్ట్ లని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాత గోపగాని సుధాకర్ మాట్లాడుతూ మా సోదరులమంతా ఇదే పాఠశాలలో చదివామని తమ తల్లిదండ్రులు గోపగాని శ్రీరాములు వీరభద్రమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు సాయం చేయటానికి ప్రయత్నిస్తున్నామని అందులో భాగంగానే విద్యార్థులందరికీ టీ షర్ట్లు అందజేస్తున్నామని అలాగే ఈ సంవత్సరం నుండి పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు 2016/- మరియు 1016/- రూపాయల చొప్పున బహుమతి ప్రధానం చేస్తామని ప్రకటించారు. ఈ విధంగా చేయడానికి అవకాశం రావడం తమ అదృష్టం అని తెలిపారు. ఆ తర్వాత ముఖ్య అతిథి ధారా సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల పాఠశాల పట్ల ప్రేమ కలిగి ఉన్న దాతలను అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఈ గుణాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎండి బాసిత్, రమణ, వేణు, పబ్బతి వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, విజయ, బసవ నాగేందర్ ఎస్ వెంకటేష్ విజయ్ కుమార్, మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు