పిల్లలమర్రిలో రసాభాస

అవినీతి అర్చకున్ని తిరిగి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు ఆగ్రహం

Sep 27, 2024 - 17:43
 0  1
పిల్లలమర్రిలో రసాభాస

ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్న గ్రామ పెద్దలు 

లక్షల్లో అవినీతికి పాల్పడ్డ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చేదే లేదని ముక్తకంఠంతో గ్రామస్తులు ఫైర్

 ఒక్కొక్కటిగా అవినీతి చిట్టా సాక్షాలతో సహా విప్పడంతో అక్కడనుండి మెల్లిగా జారుకున్న సదరు పూజారి

సూర్యాపేట(పిల్లలమర్రి) : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయం ఎదుట 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకురి శ్రీనివాస్ సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశం రసాబసాగా మారింది. పలు అవినీతి ఆరోపణలతో గత రెండు నెలల క్రితం దేవాలయం నుండి తొలగించిన ఎరకేశ్వరాలయ పూజారి నందీశ్వర్ శర్మను తిరిగి తీసుకునేందుకు గ్రామ పెద్దలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.  గతాన్ని వదిలేసి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని గ్రామ పెద్దలు అనడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయానికి వచ్చే విరాళాలలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడంతో పాటు పూజలు, పలు  సమస్యలతో మానసిక ఒత్తిడిలో ఉన్న భక్తుల బలహీనతలను వారి సమస్య తీవ్రతను బట్టి రూ 10 వేల నుండి లక్ష రూపాయల వరకు పూజలు, హోమాల పేరుతో వసూలు చేసిన్నట్లు సాక్షాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా దేవాలయానికి వచ్చే భక్తుల ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రతినెల ఏదో ఒక కార్యక్రమం పేరుతో వసూలు చేసి, కమిటీ కి ఇవ్వకుండా వాడుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. 2016 జూన్ ఒకటో తేదీన చేతి సంచి, కట్టుబట్టలతో గ్రామానికి వచ్చిన సదరు పూజారి ప్రస్తుతం 12 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు అంతస్తుల ఇల్లు, ట్రాక్టర్, కారు రెండు బైక్లు, ఇంట్లో ఉన్న అందరికీ ఐఫోన్లు ఎలా కొనుగోలు చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డాడని తెలిసి మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా ప్రమాదకరంగా మారుతాడని అందరూ ముక్తకంఠంగా వ్యతిరేకించారు.  మంత్రి, మాజీ మంత్రిని ఏమార్చే  ప్రయత్నం..స్వతహాగా వాక్ చాతుర్యం కలిగిన సదరు పూజారి నందీశ్వర్ శర్మది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ది అదే గ్రామం కావడంతో అక్కడి గ్రామ పెద్దలతో వెళ్లి ఆయనను కలిసి పిల్లలమర్రి శివాలయాలను తానే అభివృద్ధి చేశానని, చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని మళ్లీ జరగకుండా చూసుకుంటానని, తిరిగి అదే దేవాలయంలో పూజారిగా అవకాశం ఇప్పించాలని కోరాడు. దీంతో సూర్యాపేట నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి రాంరెడ్డి  దామోదర్ రెడ్డికి పొంగులేటి ఫోన్ చేసి అవకాశం ఉంటే పూజారిని తిరిగి తీసుకోవాలని కోరారు. దీంతో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామంలోని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 
లక్షల్లో అవినీతికి పాల్పడిన పూజారి మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి లను ఏమర్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నందీశ్వర శర్మ కాదు.. నందయ్య దేవాలయంలో పనిచేసిన పూజారి తన పేరు నందీశ్వర శర్మగా గ్రామస్తులకు భక్తులకు పరిచయం చేసుకోవడంతో పాటు దేవాలయ బోర్డులపై సైతం తన పేరును ప్రచురించుకున్నారు. కానీ నందీశ్వర శర్మ అసలు పేరు నందయ్య అని, వారి కుటుంబీకులు అసలు పూజారులే కాదని గ్రామస్తులు చెప్తున్నారు. 

సుక్క ముక్క లేనిదే ముద్ద దిగదు పూజారి ల కుటుంబం కాకపోవడంతో నందయ్యకు ముందు నుండే మద్యం, మాంసం అలవాట్లు ఉండేవని, దేవాలయం లో పని చేస్తూ దేవాలయంలో నివాసం ఉంటూ ఆ అలవాట్లను కొనసాగించ వద్దని ఎన్నోసార్లు హెచ్చరించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినా అతని తీరు మారలేదని చెప్తున్నారు. సమగ్ర విచారణ చేయాలి 2016 లో దేవాలయంలో పూజారిగా వచ్చిన నందయ్య రెండు మూడేళ్లు పని చేసిన తర్వాత పూర్తిగా డబ్బు సంపాదన పై దృష్టి పెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఎన్ఆర్ఐ లను, వ్యాపారస్తులను పూజలు హోమాలు పేరుతో భారీగా వసూలు చేశాడన్నారు. ఇంట్లో అందరి ఎకౌంట్ స్టేట్మెంట్ తీసి సమగ్ర విచారణ చేయాలని గ్రామస్తులు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333