నడిగడ్డలో  పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా 25% సీట్లు కేటాయించక పోతే ఉద్యమిస్తాం  

Jun 1, 2025 - 19:37
 0  15

ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం క్రింద  25 శాతం పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి, అధిక ఫీజులు అరికట్టాలి

 ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాచర్ల ప్రకాష్

జోగులాంబ గద్వాల 1 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:  గద్వాల మాచర్ల ప్రకాష్  మాట్లాడుతూ*  ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య దొరకదనే ఉద్దేశంతో  పేద తల్లి తండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను ఇంగ్లీష్ విద్య కోసం చేర్పిస్తున్నారని విద్య హక్కు చట్టం 2009, సెక్షన్ 12 ప్రకారంగా ప్రైవేటు పాఠశాలలో పేద పిల్లలకు 25% ఉచితంగా సీట్లు  ఫ్రీగా ఇచ్చే వెసులు బాటు ఉన్న కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలలో  ఒక్క సిటు కూడా పేదలకు ఇవ్వడం లేదని ఇవ్వక పొగ 20 వేలు 30 వేలు,50 వేలు,లక్ష దాక అధిక ఫిజులు వసూలు చేస్తూ విద్యను   వ్యాపారం చేస్తున్నారని అన్నారు, ఈ సంవత్సరం నుండి కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో 25% ఫ్రీ సీట్లు పేద పిల్లలకి ఇవ్వాలని డిమాండ్ చేశారు , ఇదివరకే జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగిందని కలెక్టరు,సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరం నుండి ఫ్రీ అడ్మిషన్స్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు , పేద విద్యార్థులు  ప్రైవేట్ పాఠశాల ఫిజులు చెల్లించాల్సిన అవసరం లేదని మాచర్ల ప్రకాష్ అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333