ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

May 1, 2024 - 19:40
 0  73
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

సందడిగా 20 సంవత్సరాల వార్షికోత్సవ సందడి

 తెలంగాణ వార్త కొండపాక:- కుకునూరుపల్లి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ 2003 - 2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం రిమ్మనగూడ S4 బ్రాకెట్ ఆల్ లో సందడిగా సాగింది. 10వ తరగతి పూర్తి చేసి 20 సంవత్సరాలు  పూర్తయిన సందర్బంగా  సంబరాల పేరిట 20 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్బంగా విద్య నేర్పిన గురువులకి విద్యార్థిని విద్యార్థులు సన్మానం చేసి గౌరవించుకున్నారు. అనంతరం విద్యార్థులు తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు.


   ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది కి పైన విద్యార్థులు మరియు చదువు చెప్పిన గురువులు అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న గురువులు అప్పటి హెచ్ఎం బషీరుద్దిన్ రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి నాగేంద్రం రాజిరెడ్డి తహీర్ మల్లేశం ఆంజనేయులు విద్యార్థులు బ్రహ్మచారి యాదగిరి నవీన్ సురేష్ గౌడ్ మహేష్ రజిత శ్రీమతి అనిత మాధవి రాణి శైలజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333