ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి,అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి మొత్తం (28) దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి క్షుణ్ణంగా పరిశీలించి,అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు ఆర్.డి.ఓ.రామ్ చందర్,జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.