దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ.

Apr 3, 2026 - 15:20
Apr 3, 2026 - 15:22
 0  0
దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ.

సూర్యాపేట కలెక్టరేట్, 03 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు బి సి వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయనకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని, ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. రాజకీయ, సామాజిక రంగాలలో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య గారి ఆశయాలు నేటికీ ప్రసంగించు కుంటున్నామని, రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఈ సందర్భంలో యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని,ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని అన్నారు.

బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకం దార్ల కుటుంబంలో జన్మించారు,  తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం మవడానికి భూమి కోసం భుక్తి కోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే  ప్రధాన కారణమని ఆయన అన్నారు.

 అనంతరం వివిధ సంఘాల నాయకులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో డిటిడిఓ శంకర్ వివిధ సంఘాల  నాయకులు జి.సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, చిన్న శ్రీరాములు, వి.సత్యనారాయణ,  హుస్సేన్, రాజయ్య, లింగయ్య, పి.గామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు సంబంధిత అధికారులు, తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333