తొండ గ్రామంలో అర్థరాత్రి ట్రాన్స్ఫార్మర్లు చోరీ

Jan 31, 2026 - 15:10
 0  311
తొండ గ్రామంలో అర్థరాత్రి ట్రాన్స్ఫార్మర్లు చోరీ

  తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని దాదాపు వారం రోజులుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచరించి బోరు బావిల దగ్గర 16 కెవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ వైర్లను తొలగించి ట్రాన్స్ఫార్మర్స్ లో ఉండే విలువైన సామాగ్రి దొంగలిస్తున్నారు వివరాలకు వెళితే వలిగొండ మరియు తొర్రూర్ వెళ్లే మార్గమధ్యలో తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామ శివారులో బంగ్లా మౌరి దగ్గర గుణగంటి వెంకటేశ్వరరావు అనే రైతు పొలం వద్ద అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 16 కెవి ట్రాన్స్ఫార్మర్స్ వైర్లను మరియు ఫీజులను తొలగించి లోపల ఉండబడే విలువైన కాపర్ వైరు ఆయిల్ ఇతర సామాగ్రి దొంగిలించారు మరో రైతు నరసింహారావు రేగడి పోతురాజు యాదయ్య బోరు పక్కన ఉండే 25 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఉండే విలువైన కాపర్ వైర్ మరియు ఆయిల్ ఇతర సామాగ్రిని దొంగిలించారు ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు ఏడి శ్రీనివాసరావు ఏఈ గిరిబాబు సంఘటన జరిగిన స్థలాల్లో పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ దాదాపు రెండు లక్షల రూపాయల విలువగల సామాగ్రి దొంగిలించారని అన్నారు ఇట్టి విషయంపై రైతులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లయితే విద్యుత్ అధికారులకు కానీ పోలీస్ స్టేషన్ గాని సమాచారం ఇవ్వాలని అన్నారు వారి వెంబటి లైన్ ఇన్స్పెక్టర్ ఇస్తారి లైన్మెన్ ఎల్ల గౌడ్ ఇతర విద్యుత్ అధికారులు మరియు సంబంధిత రైతులు తదితరులు ఉన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి