తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన సదస్సు
తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన సదస్సు సైబర్ నేరాలపై జాగ్రత్త తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏపూరు శాఖ మేనేజర్ ఆధ్వర్యంలో ఏపూర్ గ్రామ పంచాయతీ వద్ద తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆధార కార్డు నెంబర్ కానీ బ్యాంకు వివరాలు కానీ ఓటిపి కానీ అపరచిత వ్యక్తులకు చెప్పకూడదని కేవైసీ బయట వ్యక్తులకు ఆధార్ జిరాక్స్ కానీ ఇవ్వరాదని రైతు రుణాలు క్రాఫ్ లోన్లు తక్కువ వడ్డీ సకాలంలో చెల్లిస్తే లాభాలు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రామకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్ ,బి సైదులు, బ్యాంక్ మిత్ర జుజ్జురి సైదులు సర్పంచ్ చంద్రమోహన్,బుడిగే లింగయ్య,రాజు,మల్లయ్య, యల్లయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మ్యాజిక్ షో జానపద గీతాల ద్వారా ఆకట్టుకున్నారు