గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల పిలుపు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పిలుపు
09-10-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి అర్హత కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని గూడెం గ్రామ మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని, ఎన్నికల సమయంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని చక్రవర్తి పేర్కొన్నారు.