తుంగతుర్తి లో స్కూటీని దొంగిలించిన దుండగులు
తుంగతుర్తిలో ఇంటి తాళం పగలగొట్టి స్కూటీని దొంగిలించిన దుండగులు
బండి తో పాటు బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారంటున్న బాధితురాలు
తుంగతుర్తి 28 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ పాత సినిమా థియేటర్ దగ్గర ఇంటి తాళం పగలగొట్టి రూమ్ లో పెట్టిన TS 29 P9148 హోండా యాక్టివా ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే షేక్ చాంద్ భీ తండ్రి ఉస్మాన్ 21- నవంబర్-2024 గురువారం నాడు తన స్కూటీని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసి బంధువులే ఇంటికి వెళ్లానని తిరిగి 27 - నవంబర్-2024 బుధవారం నాడు ఇంటికి వచ్చి చూడగా ఇంటి ఆవరణలో ఒక ఇనుప రాడ్డు కనిపించగా అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు చిందరవందరంగా పడి ఉన్నాయని తెలిపింది. ఇంట్లో పెట్టిన యాక్టివా తో పాటు బీరువాలో పెట్టిన తులం బంగారం, పదివేల నగదు ఎత్తుకెళ్లారని ఏడవ సాగింది. నాకు ఒక వ్యక్తిపై అనుమానం ఉందని కచ్చితంగా చేసి ఉంటాడని తెలిపింది. గత వారం రోజులుగా నీ సంగతి చూస్తానంటూ నా మొబైల్ కి మెసేజ్ పెడుతున్నాడని బెదిరిస్తున్నాడని తెలిపింది. మద్దిరాల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కమటం సాయి పై అనుమానం ఉందని వ్యక్తం చేసింది. తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పింది.