పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు
10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ.
ఈరోజు నుండి జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా ఎస్పీ నర్సింహా ఈరోజు జిల్లా కేంద్రంలో పరీక్షలు జరుగుతున్న ప్రభుత్వ పాటశాల ZP బాలికలు, నెంబర్.2, అంజిలి స్కూల్ ల నందు కేంద్రాలు సందర్శించి పరీక్షా సరళి పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం అన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలి అని పోలీసు అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఎవ్వరూ కూడా అవకతవకలకు పాల్పడవద్దని కోరారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు రావాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు అన్నారు.
ఎస్పి వెంట పట్టణ SI ప్రవీణ్, బందోబస్తు సిబ్బంది ఉన్నారు.