తుంగతుర్తి అభివృదే నా ధ్యేయం ఎమ్మెల్యే మందుల
తిరుమలగిరి 08 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గం ఐదు సంవత్సరాల పాలనలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రగతి పద0లో ముందుకు నడిపిస్తానని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఎంతో మంది హేమాహేమీలు పోటీచేసి గెలిచారే తప్ప వారికి మెజార్టీ రాలేదని ఆయన చెప్పారు, డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు తన శ్రమను గుర్తించి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోపాటు తన సేవలకు ప్రతిఫలంగా ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన చెప్పారు గతంలో ఏ పార్టీ నుండి పోటీ చేసిన నాయకునికి రాని మెజార్టీ తనకు 52,వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి ఈ ప్రజలంతా తనకు మద్దతుపలుకారను చెప్పారు అలాగే నేడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డికి 70 వేలఓట్ల మెజార్టీని ఇచ్చి మరో మారు జిల్లాలోనే తుంగతుర్తి నియోజకవర్గం చరిత్ర సృష్టించిందని ఆయన చెప్పారు ఇదంతా మందుల సామేల్ కృషే నని ఆయన చెప్పారు తుంగతుర్తి గడ్డ మందుల సామేల్ అడ్డ అనే పదాన్ని ఈ ప్రాంత ప్రజలు నిరూపించారని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో తాను ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పల్లెలు ప్రతి ఇంటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశానని చెప్పారు తాను ప్రతి వ్యక్తికి తెలుసునని అన్నారు అందుకే తనకు ఎన్నికల సమయంలో ప్రచారానికి సమయం లేకున్నా ప్రజలందరూ తన ను గుర్తించి గెలిపించారని ఆయన చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలోని అత్యధిక మెజార్టీ వచ్చిందని అని చెప్పారు నియోజకవర్గం లోని తండాలకు సిసి రోడ్లను మంజూరు చేయిస్తానని అని తెలిపారు ఇప్పటికే కొన్ని గ్రామాలలో సిసి రోడ్లు పూర్తయి అని అన్నారు అలాగే విద్యా వైద్యం తో పాటు నియోజకవర్గంలో తిరుమలగిరి ,తొండ మాలిపురం ,తాటిపాముల అనంతారం నందాపురం గ్రామాలకు శ్రీరామ్ సాగర్ జరాల ద్వారా తాగు సా గునీటిని రప్పిస్తానని అని చెప్పారు ఇందుకోసం తాను జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో ఈ విషయాన్ని చర్చించానని చెప్పారు అందుకు సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు అలాగే నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాచాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అలాగే జిల్లా మంత్రుల సహకారంతో మంజూరు చేయించానని అని చెప్పారు త్వరలోనే కళాశాలను ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేస్తారని చెప్పారు గతంలో వెనుకబడ్డ తుంగతుర్తి నియోజకవర్గాన్ని తన హయాంలో జిల్లా మంత్రులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేయడానికినిధులు మంజూరు చేయాలని కోరుతూ విన్నవిస్తానని ఆయన చెప్పారు గతంతో పాటు వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘనవిజయాన్ని సాధించాలని ఆయన చెప్పారు ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం సాధించాలని ఆయన కోరారు అలాగే తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ అరవ పెళ్లి మండలాల్లో సిసి రోడ్డుతో పాటు తారు రోడ్లను కూడా మంజూరు చేయిస్తానని ఆయన చెప్పారు ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ చాగంటి అనసూయ రాములు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమిలాల్ ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ,మున్సిపాలిటీ అధ్యక్షులు పేరాల వీరేష్ జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్ పిఎసిఎస్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్ ఎస్టీ సెల్ నాయకులు రామోజీ ఆవిలమల్లు అన్నెబోయిన సుధాకర్ తుంగతుర్తి మీడియా ఇన్ఛార్జి కందుకూరు లక్ష్మయ్య ఫతేపురం సుధాకర్ రాపాక సోమేశ్ దు పటి మల్లయ్య ఆకుల బుచ్చిబాబు పానగంటి నరసింహారెడ్డి నాతి వీరమల్లు గౌడ్ నాయుని కృష్ణతదితరులు పాల్గొన్నారు