తిరుమలగిరిలో వడదెబ్బతో యువకుడు మృతి

May 23, 2026 - 18:05
May 24, 2026 - 12:33
 0  928
తిరుమలగిరిలో వడదెబ్బతో యువకుడు మృతి

తిరుమలగిరి 23 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన చెవుగాని ప్రసాద్ (33) అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు తీవ్రమైన ఎండల ప్రభావంతో అస్వస్థకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూశాడు యువకుడి అకాల మృతితో కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ప్రస్తుత ఎండల తీవ్రత దృశ్య ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు యువకుడి మరణంతో తిరుమలగిరిలో విషాదం నెలకొంది.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి