BRS నాయకుడు చింతలపాటి మధు దారుణహత్య.

May 23, 2026 - 12:37
May 23, 2026 - 12:39
 0  6
BRS నాయకుడు చింతలపాటి మధు దారుణహత్య.

సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో మరోసారి భగ్గుమన్న  రాజకీయ కక్ష్యలు. BRS నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణహత్య. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు  హత్య చేసి గోనె సంచిలో కట్టి యర్కారం గ్రామ శివారులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భగ్గు మంటున్న రాజకీయ కక్షలు :
యర్కారంలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయ్. కక్షలు  రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామ పరిధిలో భూముల క్రయవిక్రయాలు చేయాలన్న వణికి పోతున్నారు. ఇరుగుపొరుగు గ్రామాల నుంచి చుట్టరికం కలుపుకోవడానికి సైతం భయపడే పరిస్థితి వచ్చింది. నాలుగు రాజకీయ హత్యలు జరిగిన తర్వాత కొంత ప్రశాంత వాతావరణం ఉందని భావిస్తే కొంతకాలానికి రాజకీయ ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో మళ్లీ రాజకీయాలు హత్యలు చేసుకోవడం పరంపరగా కొనసాగుతుంది. రాజకీయ, వ్యక్తిగత కక్షలతో గొడవలు ఆగడం లేదని ఆరోపిస్తున్నారు. యర్కారం గ్రామానికి చెందిన ఎనిమిది మంది చనిపోయినట్లు తెలుస్తుంది.  సిద్దయ్య దగ్గర నుంచి మొదలైన హత్యలు చింతలపాటి మధు వరకు చేరుకున్నాయి. వై. సిద్దయ్య, చింతల పాటి ఈదయ్య, అజయ్, రమేష్, మిద్దె రవీందర్, ఒంటెద్దు వెంకన్న, వడ్డే ఎల్లయ్య, ఇప్పుడు చింతల పాటి మధు వరకు హత్య కు గురైయ్యారు. అధికార యంత్రాంగం గ్రామంలో నిఘా పెట్టి రాజకీయ కక్షలు లేకుండా చూడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333