ప్రజావాణికి 38 ఫిర్యాదులు జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 11 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ బి. యం. సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 38 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ రావు లతో కలసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కొసం దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను అర్హతల మేరకు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.