తిరుమలగిరి మున్సిపల్ లో పడకేసిన పారిశుద్ధ్యం

తిరుమలగిరి 16 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
అంధకారంలో మూడవ వార్డు...
చెత్తను తీశారు ఎత్తడం మరిచారు...
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందించని వైనం...
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పారిశుద్ధ్య పడకేసింది ఆదర్శనగర్ లోని దోమల బెడద ఎక్కువైంది వానాకాలం సమీపిస్తుండడంతో దోమల విజృంభనకు అవకాశం ఉండగా డ్రైనేజీలో చెత్తాచెదారం తొలగించడం మరుగునీటిలో దోమల వ్యాప్తి చెందకుండా చూడాల్సిన మున్సిపల్ సిబ్బంది నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీలో చెత్తాచెదారం తీశారు ఎత్తడం మరిచారు మరియు మూడవ వార్డులో గత నెల రోజుల నుండి అంధకారంలో కాలనీ కనీసం విద్యుత్ స్తంభాలకు లైట్లు అమర్చడం లేదు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే టార్చి లైట్ పట్టుకొని వెళ్లే పరిస్థితి నెలకొన్నది దీనికి పర్యవేక్షణ లోపమే ముఖ్య కారణం అని మండిపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు తెలిపారు..