గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్ కి వినతి పత్రం అందజేసిన

బహుజన సేన జిల్లా అధ్యక్షుడు దానయ్య, డాక్టర్ ప్రేమ్ కుమార్, జర్నలిస్ట్ గోపాల్

Nov 1, 2024 - 20:58
 0  12
గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్ కి వినతి పత్రం అందజేసిన
గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్ కి వినతి పత్రం అందజేసిన
గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్ కి వినతి పత్రం అందజేసిన

బాత్రూములకు డోర్లు లేక బకెట్లు అడ్డం పెట్టుకొని మలవిసర్జన చేస్తున్న విద్యార్థులు.

 పదవ తరగతి విద్యార్థులకు టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.

 విద్యార్థులతో 100 నుండి 200 డబ్బులు వసూలు చేసి హాస్టల్ బిల్డింగ్ కి కలర్ వేస్తున్న ప్రిన్సిపాల్. 

జోగులాంబ గద్వాల 1 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సమస్యల విషయంపై కలెక్టర్ కి శుక్రవారం రోజున వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ..సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అని అన్నారు.హాస్టల్లో దాదాపు 550 మంది విద్యార్థులుకు గాను50 బాత్రూమ్స్ ఉండడం గమనార్ధం అయితే ఒక్క బాత్రూంకీ కూడా డోర్స్ లేవు.ఇదే విషయంపై విద్యార్థులను అడగగా ఎదురు ఎదురుగా ఉన్న బాత్రూములకు ఒక్క డోర్స్ కూడా లేవుకదా బాత్రూంకి ఎలా వెళ్తారు అని అడగగా విద్యార్థులు చెప్పిన మాటలు వింటే గుండెతరుక్కుపోతుందని అన్నారు,విద్యార్థులు బాత్రూం కుసున్నప్పుడు బకెట్లో అడ్డం పెట్టుకొని కూర్చుంటున్నాం అని విద్యార్థులు వాపోయారు. సాధారణంగా గ్రామాలలో మాలవిసర్జనకు బయటికి వెళితే  ఒకరికొకరు చూసుకొని కూర్చునే పరిస్థితి ఉండదు  కానీ హాస్టల్లో చూస్తే విద్యార్థు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది.ఇంత దారుణాతి దారుణంగా  ఏ హాస్టల్లో కూడా కనబడలేదు.స్నానం ఎలా చేస్తారు అడుగుతే ఒకరు స్నానం చేసేటప్పుడు ఒకరు బయట ఉండాలని అన్నారు.రూముల యొక్క డోర్స్ కూడా అక్కడక్కడ పగిలిపోవడంవలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి లేనట్టే.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇటిక్యాల స్కూల్లో టీచర్లు కరువయ్యారు అని అన్నారు.అందరు టీచర్లు కలిపి 36 మంది ఉండగా ఇద్దరే టీచర్లే రెగ్యులర్ గా ఉండడం గమనార్ధం, ప్రిన్సిపాల్ కూడా ఇన్చార్జిగా ఉండడం మరో కోసమేరుపు.అందరు గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్లే ఉన్నారు,పదవ తరగతి విద్యార్థులకు సరైన టైంలో సిలబస్ పూర్తికావడం లేదని విద్యార్థులు తెలపడం జరిగింది,పదో తరగతి విద్యార్థులకు టీచర్ల కొరత ఉందని విద్యార్థులు తెలిపారు ఇది ఇలాగ ఉండగా.విద్యార్థులకి రావాల్సిన కాస్మోటిక్ చార్జీలను వాడుకుంటూ మరియు విద్యార్థుల నుండి అదనంగా 100 నుండి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్న ప్రిన్సిపల్,ఆ పైసల్ తోని స్కూళ్లకు పెయింట్  వేయిస్తున్నారని అని విద్యార్థులు తెలిపినారు. 
మెనూ విషయానికొస్తే విద్యార్థులకు ఉడికి ఉడకని అన్నం వడ్డించడంతో విద్యార్థులకు జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నారు చుట్టుపక్కల పరిసరాలు నీటిగా లేకపోవడం వల్ల మలేరియా,డెంగు, డయేరియా,టైపాడు జలుబు,దగ్గు,లాంటి వ్యాధులకు గురవుతూ ఆస్పత్రిపాలవుతున్నారు.విద్యార్థులకు సరైన వైద్యం అందించడానికి అక్కడ ఫార్మసిస్ట్ వంటి వారు కూడా సమయానికి లేకపోవడం జరుగుదని అన్నారు.కలెక్టర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించని పక్షాన విద్యార్థులతల్లిదండ్రులతో ఉద్యమిస్తామని తెలిపారు.అయితే ఇదే సమస్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో బాత్రూం విషయంలో గాని మెనూ విషయంలో గాని విద్యార్థులంతా సమస్య వలయంలో ఉన్నారు.ఈ సమస్యలపై కలెక్టర్ చొరవ తీసుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333