తిరుమలగిరి నూతన కమిషనర్ గా రామచంద్రారావు

Jan 23, 2026 - 10:59
 0  194
తిరుమలగిరి నూతన కమిషనర్ గా రామచంద్రారావు

  పురపాలక సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరణ

 

తిరుమలగిరి 23 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పురపాలక సంఘం కార్యాలయ నూతన కమిషనర్ గా యం రామచంద్రరావు నేడు ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు ఖమ్మం జిల్లాలో కల్లూరి పురపాలక లో కమిషనర్ గా విధులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు తిరుమలగిరి పురపాలక సంఘ కమిషనర్ గా బదిలీగా రావడం జరిగింది. అనంతరం కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది కమిషనర్ కు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన కమిషనర్ యం రామచంద్రరావు మాట్లాడుతూ  మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అందరి సహాయ సహకారాలతో తాను పురపాలక సంఘ అభివృద్ధికి పాటుపడతానని వారు స్పష్టం చేశారు. అనంతరం  కార్యాలయ సిబ్బంది తో కలిసి ఇటీవల ఇక్కడ పనిచేసిన కమిషనర్ అన్వర్ ఆలీ బదిలీపై వెళుతున్న సందర్భంగా వారికి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి