తహశీల్దార్ ఆధ్వర్యంలో భూములను పరిశీలించాలి
చర్ల డిసెంబర్ 20 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల తహసిల్దార్ కి జీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం మెమోరాండం అందించారు.అనంతరం సంఘం అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ చర్ల జీలో సర్వే నెంబరు 53/3 గతంలో పనిచేసిన ఐ టి డి ఏ పీవో రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ సుమారు మూడుఎకరాల ప్రభుత్వ భూమిని డివిజనల్ సర్వేర్ తో సర్వే జరిపించారని, ఆ యొక్క భూమిలో కొంతమంది గిరినేతరులు కొనుగోలు చేసామని, మరి కొంతమంది పట్టా ఉందని చెబుతున్నందున తహసిల్దారు రికార్డు ప్రకారంగా పరిశీలించాలని అన్నారు. ఏజెన్సీలో గిరినేతరుల మధ్య భూమి క్రియ విక్రయాలు చట్ట విరుద్ధం అయినప్పటికీ ఆ భూమిని కొంతమంది కొనుగోలు చేశామని చెప్తున్నారని, వాస్తవ ఏజెన్సీ రికార్డ్ ప్రకారంగా ప్రభుత్వ భూమిగా రికార్డులో కొనసాగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు విద్యార్థి, జెఎసీ రాష్ట్ర నాయకులు ఇర్ఫా ప్రకాష్, శరం రవీంద్ర పాల్గొన్నారు.