**కోదాడ పట్టణ షీ టీమ్స్"యువతకు కౌన్సిలింగ్ నిర్వహించిన""షీ టీం ఎస్ఐ మల్లేశం*

కోదాడ పట్టణ షీ టీమ్స్.యువతకు కౌన్సిలింగ్ నిర్వహించిన కోదాడ డివిజన్ షీ టీం ఎస్ఐ మల్లేశం.
తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ*****జిల్లా షీ టీం బృందాలు మహిళా బాలికల రక్షణలో భాగంగా ప్రతిరోజు రద్దీ ప్రాంతాలు మాల్స్ థియేటర్స్ కళాశాలలు బస్టాండ్ వద్ద నిఘా గస్తీ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈరోజు కోదాడ పట్టణంలో కొంతమంది యువతకు కోదాడ డివిజన్ షీ టీం వారు కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచి అలవాటు కలిగి ఉండాలని మహిళల పట్ల, బాలికల పట్ల, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదని సూచించారు. హెయిర్ స్టైల్ మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుందని తెలిపారు. పట్టణంలో బైకులపై అడ్డగోలుగా రైడ్స్ నిర్వహించవద్దని నిదానంగా వెళ్లాలని సూచించారు. మహిళా సంబంధిత కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చదువులు, ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళడం సమస్యలు తలెత్తుతాయాని వారికి వివరించడం జరిగినది.