అమిత్ షాను పదవి నుంచి తొలగించాలి

Dec 20, 2024 - 19:19
Dec 20, 2024 - 20:19
 0  10
అమిత్ షాను పదవి నుంచి తొలగించాలి

జాతీయ మాల మహానాడు డిమాండ్  చర్ల,డిసెంబర్ 20 పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన అమితిషా ను కేంద్ర హోం మంత్రి పదవి నుంచి తొలగించాలని చర్ల జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి గణపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి, తోటమల్ల రమణమూర్తి, రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య కొంగురి నరసింహారావు, కొంగూరి రమణారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద చర్ల,భద్రాచలం ప్రధాన రహదారిపై రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించి అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలు చేసే నిండు పార్లమెంటు సభలో కేంద్ర హోం మంత్రి అమితిషా అంబేద్కర్ అంబేద్కర్ అనడం వల్ల ఏమి వస్తుందని దేవుళ్లను పూజించడం వల్ల ఎక్కువ రోజులు బ్రతుకుతారని, అంబేద్కర్ ను అవమాన పరిచిన తీరు యావత్ సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమితిషా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోడీ, బిజెపి నాయకత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికై ఒక బాధ్యతగల పదవిలో ఉండి అంబేద్కర్, అంబేద్కర్ అని అవహేళన చేయడం అమితేషా కు తగదని హెచ్చరించారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను అమితిషా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో దళిత సంఘల ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు తోటమల్ల వరప్రసాద్, బోళ్ల వినోద్, తోటమల్ల గోపాలరావు, అధ్యక్షులు రుంజా రాజా, సీనియర్ నాయకులు కారంపూడి సాల్మన్ రాజ్, కొంగూరు సత్యనారాయణ, తోటమల్ల కృష్ణారావు, తోటమల్ల రవికుమార్, కాకర్ల జయరాజు, మేడబత్తిని శ్రీనివాసరావు,గుండ్ల అమర్, గుండ్ల రంజిత్, మైపా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు