తల్లి,తండ్రుల మనోవేదనను తీర్చిన ఎమ్మెల్యే గారు

Jul 16, 2024 - 19:20
 0  23
తల్లి,తండ్రుల మనోవేదనను తీర్చిన ఎమ్మెల్యే గారు

 మతిస్థిమితం కోల్పోయి న యువకుడిని  బెంగాల్ రాష్ట్రం  నుంచి రప్పించిన ఎమ్మెల్యే గారు.  జీవితాంతం ఎమ్మెల్యే గారిని రుణం తీర్చుకోలేము- యువకుడి తండ్రి రాములు.

   జీవిత చరమాంకం లో తోడు ఉండాల్సిన కన్న కొడుకు మతిస్థిమితం కోల్పోయి గ్రామం ,జిల్లా ,రాష్ట్రం దాటి       పశ్చిమ  బెంగాల్ రాష్ట్రం లోని మాల్దా జిల్లా లో రోడ్ లపై బంగ్లాదేశ్ దేశ సరిహద్దు లో అనాయమకుడు గా  తిరుగుతున్న జోగులంబ గద్వాల జిల్లా వాసి  గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప (26)   ను అక్కడ ఉన్న స్వచ్చంద సేవ సంస్థ నిర్వాహకుడు తార శంకర్ చేరదీసాడు. వివరాలకు వెళితే  గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాములు కుటుంబానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు   తిమ్మప్ప రెండు సంవత్సరాల కింద మతిస్థిమితం కోల్పోయి  ఎటు వెళ్లాడో 
తెలియక తల్లి దండ్రులు వెతికిన ప్రాంతం లేదు . కన్న కొడుకు తప్పి పోవడం తో  వారికి  మనోవేదన తీరనిది. చెట్టంత కొడుకు తప్పిపోవడం తో కొడుకు ఆచూకి  కోసం తల్లి దండ్రుల మొక్కని దేవుళ్ళు లేరు. కానీ చివరకు వారి మొక్కులు ఫలించాయి
 పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని     మాల్దా  జిల్లా లో    స్వచ్చంద సేవ  సంస్థ నిర్వాహకులు  తార శంకర్ సమక్షం లో తమ బిడ్డ క్షేమంగా  వున్నడని  తెలియడం తో తల్లిదండ్రుల భారం తీరింది. స్వచ్ఛంద నిర్వాహకులు  తిమ్మప్ప  ను చేరదీసి రెండు నెలలు ఆయన యోగ క్షేమాలు చూసుకున్నారు. తిమ్మప్పను స్వచ్చంద సంస్థ నిర్వాహకుకు  వివరాలు అడిగితే   కేవలం ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేరు మాత్రమే  చెప్పారని  అంతర్జాలం లో కృష్ణ మోహన్ రెడ్డి వివరాలు సేకరించి ఎమ్మెల్యే కు ఫోన్ చేసి  మాట్లాడడం జరిగిందని  తార శంకర్ మీడియా ముందు తెలిపారు.   

ఎమ్మెల్యే వెంటనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించి సొంత ఖర్చులతో బెంగాల్ రాష్ట్రం నుండి హైదరాబాద్ కు విమానం లో  మతిస్థిమితం కోల్పోయిన తిమ్మప్ప తో పాటు స్వచ్చంద సంస్థ నిర్వహకులను కూడా రప్పించి వారి సమక్షం లో మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో  తల్లిదండ్రులకు తిమ్మప్పను  అప్పగించడం జరిగింది. 
తిరిగి రాడు అనుకున్న కన్న కొడుకు కళ్ళ ముందు  తమ చెంతకు చేరడం తో   ఎమ్మెల్యే కృష్ణ మోహాన్ రెడ్డి కి జీవితాంతం రుణం ఉంటామని తండ్రి రాములు తెలిపారు.
 ఈ సందర్బంగా  ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
  మతిస్థిమితం కోల్పోయిన తిమ్మప్ప కు మెరుగైన  వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహుడు తార శంకర్ ను ఎమ్మెల్యే సన్మానించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333