డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం సిఐ రఘువీర్ రెడ్డి

తిరుమలగిరి 25 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వాటికి బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని సీఐ రఘువీర్ రెడ్డి అన్నారు బుధవారం తిరుమలగిరి మండలం అనంతరం మోడల్ స్కూల్లో యాంటీ నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్స్ పై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి మత్తు మద్యపానం ధూమపానం అలవాటు పడి వాటికి బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు డ్రగ్స్ వినియోగం విష ప్రయోగం లాంటిది ఇది అత్యంత ప్రమాదకరం కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుంది డ్రగ్స్ సరఫరా చేస్తున్న సంఘవిద్రోహశక్తుల చేతిలో యువత జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి తెలిసి తెలియని వయసులో వాటి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు కావాలనే తమ అక్రమ సంపాదన కోసం యువతకు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు త్వరలో గంజాయి సేవించిన వారి గుర్తు పట్టడానికి కిట్లు వస్తున్నాయని అన్నారు
మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్సై సురేష్
మత్తు పదార్థాలు సేవించిన,విక్రయించిన చట్టరీత్యా నేరమని డ్రగ్స్ విక్రయించే వారిపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు డ్రగ్స్ మహమ్మారి వలన యువత పెడదారి పడుతుందని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గంజాయి,డ్రగ్స్,మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటు మత్తు పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.